ఏలూరు (టూటౌన్): నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ప్రమాద బీమా రూ.10 లక్షలు అందించాలని యూనియన్ నాయకులు ఎర్ర రాంబాబు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సీఐటీయు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలో భాగంగా కలెక్టరేట్ వద్ద ధర్నాలో ఎర్ర రాంబాబు మాట్లాడారు. ప్రభుత్వం మార్చి నెల నుంచి ప్రవేశపెట్టిన సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రమణారావు మాట్లాడుతూ గత ఆరేళ్లుగా పోరాడిన కార్మికులకు పునరుద్ధరించిన కార్మిక సంక్షేమ బోర్డులో స్థానం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో నిర్మాణ కార్మికులందరికీ చట్టం అమలు చేయాలని, 58 ఏళ్లు దాటిన భవన నిర్మాణ కార్మికులకు రూ.5000 పెన్షన్ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చిట్టికొమ్మ కొండలరావు, తేడ్ల నాగరాజు, రెడ్డి లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.


