జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం దంచికొట్టింది. ఏలూరు నగరంలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు తీవ్రమైన ఎండ, ఉక్కపోత. 3 గంటలు దాటిన తరువాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి దట్టమైన మబ్బులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. గంటన్నర పాటు ఏలూరు నగరంలో వర్ష బీభత్సం కనిపించింది. నగరంలోని ప్రధాన కూడళ్లు వర్షపు నీటితో నిండిపోయాయి. పవరుపేట, చాణిక్యపురి కాలనీ, ఫైర్‌స్టేషన్ సెంటర్ వంటి ప్రధాన సెంటర్లల్లో చెట్లు కూలి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కళాశాలలు వదిలే సమయం కావడంతో విద్యార్థులు ఇళ్ళకు చేరేందుకు అవస్థలు పడ్డారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు
డీసీసీబీ బ్యాంకు మెయిన్ రోడ్డులో..
ఏలూరు కొత్త బస్టాండ్ ఇలా..
ఏలూరు ఓవర్ బ్రిడ్జిపైన రెయిలింగ్ ధ్వంసమై దృశ్యం
వర్షపు నీటిలో పత్తేబాద రైతుబజార్


