పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Apr 6 2026 8:00 AM | Updated on Apr 6 2026 8:00 AM

నిడమర్రు: మండలంలోని పత్తేపురంలో లాల్‌ బహుదూర్‌ శాస్త్రి ఓరియంటల్‌ (పాచ్య) కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. 1967 నుంచి 1994 మధ్య కాలంలో ఇక్కడ చదువుకున్న సుమారు 135 కుటుంబాలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి మూర్తిరాజుకు నివాళులర్పించిన అనంతరం అప్పటి అనుభూతులను నెమరు వేసుకొన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమ గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. గ్రూప్‌ ఫొటోలు దిగారు. క్షేమ సమచారం తెలుసుకున్నారు. మృతి చెందిన గురువులను గుర్తించుకుని నివాళులర్పించారు. ప్రస్తుతం కళాశాల అక్కడ లేకపోయినా, తమ గుండెల్లో ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయని వారు భావోద్వేగానికి లోనయ్యారు. ఆదివారం గ్రామమంతా పండిత శ్రేష్టులతో పులకించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement