పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ

Apr 6 2026 8:00 AM | Updated on Apr 6 2026 8:00 AM

కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మను దర్శించుకున్నారు. మహిహిళలు పాల పొంగళ్లు సమర్పించారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారికి తలనీలాల మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్ర పటాల అమ్మకం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.1,15,082 వచ్చిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement