ఆకివీడు మండలంలో 144 సెక్షన్ అమలు
భీమవరం(ప్రకాశం చౌక్): ఆకివీడు మండలంలో హిందూ, క్రైస్తవ, స్వచ్చంద సంస్థలు, రాజకీయ పార్టీలు చేపట్టే ర్యాలీలు, ఇతర కార్యక్రమాలకు అనుమతులు లేవని, 5న చలో ఆకివీడు పేరిట ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు పెట్టుకున్న సంస్థలు రద్దు చేసుకొవాలని భీమవరం డీఎస్పీ రఘువీరా విష్ణు అన్నారు. శనివారం భీమవరం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆకివీడు పెద్దపేటలో ప్రస్తుతం ప్రశాంత వాతవరణం ఉందని, ర్యాలీలు ఏర్పాటు చేయడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. మండలంలో 144 సెక్షన్ అమల్లో ఉందని. అలాగే 30 పోలీసు యాక్ట్ కూడా అమల్లో ఉందన్నారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


