ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సంగీత రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఏలూరు నగరానికి చెందిన ఎస్‌పీఎస్ మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపకుడు ఎస్‌పీఎస్ వాసుకు స్వర్ణ నంది పురస్కారం వరించింది. ఆయన సంగీత రంగంలో చేసిన కృషికి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం అందుకున్నారు. ఖమ్మంకు చెందిన మొగిలి అండ్ ఎన్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఆయనను గుర్తించి స్వర్ణ నంది పురస్కారాన్ని ప్రకటించింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖుల సమక్షంలో వాసుకు స్వర్ణ పురస్కారం అందజేసి సన్మానించారు.


