‘లేఖ్య’ పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘లేఖ్య’ పుస్తకావిష్కరణ

Mar 23 2026 8:35 AM | Updated on Mar 23 2026 8:35 AM

పక్షుల విహార కేంద్రంలో సందడి రాట్నాలమ్మకు పూజలు

జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మెట్టా నాగేశ్వరరావు రచించిన తాజా కవితా సంపుటి శ్రీలేఖ్య్ఙను నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఆదివారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం, తెలంగాణ శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్న చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరిగినట్లు మెట్టా నాగేశ్వరరావు తెలిపారు. ఆడపిల్లలు పుడితే ఏడ్చే తండ్రులకు, మహిళలను తక్కువ చేసి చూసే పురుషులకు కనువిప్పు కలిగించే పుస్తకం ఉందని ప్రశంసించారు.

కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గధామంగా పేరుగాంచిన ఆటపాక పక్షుల విహార కేంద్రంలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. సమీప జిల్లాల నుంచి యాత్రికులు పెద్ద సంఖ్యలో వాహనాల్లో విచ్చేశారు. బోటు షికారు చేస్తూ అరుదైన పెలికాన్‌ పక్షుల విన్యాసాలను దగ్గరుండి తిలకించారు. అనంతరం పక్షి నమూనా మ్యూజియాన్ని సందర్శించారు. చిల్డ్రన్స్‌ పార్కులో చిన్నారులు ఆడుకుని ఆనందించారు. కొల్లేరు సరస్సు భౌగోళిక నైసర్గిక స్వరూపం, విదేశీ ,స్వదేశీ పక్షుల విశేషాలను పర్యాటకులు అడిగి తెలుసుకున్నారు.

పెదవేగి: భక్తుల పాలిట కల్పతరువు రాట్నాలమ్మకు భక్తులు విశేష పూజలు నిర్వహించారు. పెదవేగి మండలం రాట్నాలకుంటలో వేంచేసిన మహిమ గల తల్లికి ఆదివారం ప్రీతికరమైన రోజుకావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో దేవస్థానానికి విచ్చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు అసౌకర్యం కలుగకుండా ధర్మకర్తల మండలి సభ్యులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement