భీమవరం : పట్టణంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అండర్– 23 మెన్ అండ్ ఉమెన్ జాతీయ స్థాయి బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా ఏపీ ఆమెచూర్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సాగి రామకృష్ణ నిషాంత్‌వర్మ మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 240 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. సాగి రామకృష్ణంరాజు పేరిట నిర్వహిస్తున్న పోటీలు ఈ నెల 22 వరకూ ఉంటాయన్నారు.
విజేతలు వీరే..
ఈ పోటీలలో 54 కేజీల కేటగిరిలో లడక్‌కు చెందిన శుభకర్మన్సింగ్, మిజోరామ్‌కు చెందిన అభిషేక్, 57 కేజీల విభాగంలో మణిపూర్‌కు చెందిన అర్మాన్, 48 కేజీల విభాగంలో హర్యానాకు చెందిన లక్షయ్, మధ్యప్రదేశ్‌కు చెందిన షేక్ హర్షద్, పంజాబ్‌కు చెందిన నిర్మల్, తెలంగాణకు చెందిన చౌహాన్, తమిళనాడుకు చెందిన ఉజ్వల్, ఢిల్లీకి చెందిన దేవేంద్ర సోలంకి, ఆంధ్రప్రదేశ్ నుంచి కె.శైన్‌కుమార్, చండీగర్ నుంచి తరుణ్ క్వాలిఫైయింగ్ రౌండ్స్‌లో విజయం సాఽధించారు. 51 కేజీల విభాగంలో ఢిల్లీకి చెందిన అశు, తెలంగాణకు చెందిన ఆయుష్, 54 కేజీల విభాగంలో పంజాబ్‌కు చెందిన సురేంద్ర పాల్‌సింగ్ విజయం సాధించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కె బంగార్రాజు, రింగ్ అఫీషియల్ చైర్మన్ రాకేష్ భరద్వాజ్, ఇండియన్ అమ్మేచూర్ బాక్సింగ్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ రాకేష్ తక్కరన్, ఐబీఏ అబ్జర్వర్ సింగ్ రాజ్ కున్వర్ సింగ్, బాక్సింగ్ అసోసియేషన్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ సంజీబ హనదీప్, ఐఏబిఎఫ్ వైస్ ప్రెసిడెంట్ మదన్ కోటి కౌటిల్, కళాశాల ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.


