తల్లి మందలించిందనీ.. | - | Sakshi
Sakshi News home page

తల్లి మందలించిందనీ..

Mar 19 2026 7:54 AM | Updated on Mar 19 2026 7:54 AM

తల్లి మందలించిందనీ..

ఏలూరు టౌన్‌: తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారపుపేటకు చెందిన శ్రీనివాసరావు, లక్ష్మీ దంపతుల రెండో కుమార్తె అనూష (19) ఇంటర్మీడియెట్‌ నీట్‌ లాంగ్‌ టర్మ్‌ ఇంటి వద్దనే ఉంటూ చదువుతోంది. అనూషను తల్లి లక్ష్మి బుధవారం నిత్యం చదువుతూ ఉంటే ఎలా.. తిండి కూడా తినాలి అంటూ మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన అనూష ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏలూరు జీజీహెచ్‌కు తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఏలూరు టూటౌన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement