ఉత్కంఠభరితంగా టెన్నిస్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్కంఠభరితంగా టెన్నిస్‌ పోటీలు

Mar 19 2026 7:54 AM | Updated on Mar 19 2026 7:54 AM

ఉత్కంఠభరితంగా టెన్నిస్‌ పోటీలు

భీమవరం: ఆల్‌ ఇండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు భీమవరం కాస్మోపాలిటన్‌ క్లబ్‌ ఆవరణలో ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. 35+ సింగిల్స్‌ విభాగంలో కేఎస్‌ఎన్‌రాజుపై కె.అమిత్‌రెడ్డి 6–4, 6–4 పాయింట్ల తేడాతో విజయం సాధించగా, టి.సంజీవ్‌పై ఈశ్వర సాయి 6–4, 6–1 తేడాతో, జానకిపై కె.సతీష్‌ 6–4, 6–3 పాయింట్ల తేడాతో, ఎ.చైతన్యపై ఎన్‌డీ విజయ్‌ ఆనంద్‌ 6–2, 6–0 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. 45+ సింగిల్స్‌ విభాగంలో ఎం.శివకుమార్‌రాజుపై ఎంవీఎల్‌ఎన్‌ రాజు 6–4, 6–4 పాయింట్లతో, అశ్విన్‌కుమార్‌పై కె.సంపత్‌కుమార్‌ 6–2, 6–3 పాయింట్ల తేడాతో, రమేష్‌ బాలుపై రామకృష్ణయ్య 6–2, 6–1 తేడాతో, సీతారామరాజుపై ఎంఎస్‌.కిరణ్‌ 6–2, 6–4 పాయింట్ల తేడాతో గెలుపొందారు. అదేవిధంగా 55+ సింగిల్స్‌ విభాగంలో ఆదిశేషయ్యపై కేవీఎన్‌ మూర్తి 6–0, 6–1 పాయింట్ల తేడాతో, నగేష్‌పై సీహెచ్‌ శివ 6–4, 5–7, 10–5 పాయింట్ల తేడాతో, రాజాపై బాబు రాజా 6–1, 6–2 పాయింట్ల తేడాతో, సుధాకర్‌రెడ్డిపై బాబు రాజా 6–3, 6–4 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. 65+ సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో ఎస్‌ఎస్‌.రథ్‌పై వి.శ్రీనివాసరెడ్డి 6–0, 6–2 పాయింట్ల తేడాతో, మన్మథరావుపై ఎస్‌.ఆనంద్‌ స్వరూప్‌ 6–2, 7–5 పాయింట్ల తేడాతో గెలుపొందారు. 70+ సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో వి.ధనుంజయులుపై ఎస్‌.సేతు 6–1, 7–6, 7–1 పాయింట్ల తేడాతో, అశోక్‌రెడ్డిపై కె.రాధాకృష్ణమూర్తి 6–0, 6–0 పాయింట్ల తేడాతో విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement