ఏలూరు పోలీసులకు పతకాల పంట | - | Sakshi
Sakshi News home page

ఏలూరు పోలీసులకు పతకాల పంట

Mar 19 2026 7:54 AM | Updated on Mar 19 2026 7:54 AM

ఏలూరు టౌన్‌: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీస్‌ శాఖలో అత్యుత్తమ ప్రతిభ చూపుతూ ప్రజలకు విశేష సేవలందించిన పోలీస్‌ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉగాది పురస్కారాలను ప్రకటించింది. ఉత్కృష్ట సేవాపతకం, ఉత్తమ సేవా పతకం, సేవా పతకాలకు పోలీస్‌ అధికారులు, సిబ్బంది 10 మందిని ఎంపిక చేశారు. ముఖ్యంగా ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌కు ఉత్కృష్ట సేవా సతకాన్ని అందజేయటం విశేషం. ఇక జిల్లాలో 10 మందికి ఉగాది పురస్కారాలు దక్కటంపై ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుకు సేవా పతకం, పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావుకు సేవా పతకం దక్కింది. ఏలూరు జిల్లా ఏఆర్‌ ఎస్సై పిచ్చికల రవీంద్రకు ఉత్తమ సేవా పతకం, స్పెషల్‌ బ్రాంచ్‌ హెచ్‌సీ వేగేశ్న వేణుగోపాలస్వామి, ఏఆర్‌ హెచ్‌సీ శానం రమేష్‌కుమార్‌, ఏఆర్‌ హెచ్‌సీ గుమ్మళ్ల శ్రీనివాసరావు, దిశ స్టేషన్‌ కానిస్టేబుల్‌ ఎన్‌.గోపాలకృష్ణ, ఏలూరు ట్రాఫిక్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ ఎ.ఫణికుమార్‌, సైబర్‌ సెల్‌ కానిస్టేబుల్‌ మన్నెం సాయిశివకుమార్‌, ఏలూరు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ జి.నాగశ్రీనివాసరావుకు సేవా పతకం అందజేయనున్నారు.

ఐజీ అశోక్‌కుమార్‌కు

ఉత్కృష్ట సేవా పతకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement