పునరావాస కేంద్రాలుగా కారాగారాలు
కై కలూరు: ఖైదీలకు పునరావాస కేంద్రాలుగా జైళ్లు మారుతున్నాయని ప్రిజనర్స్, కరక్షనల్(దిద్దుబాటు) సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ పేర్కొన్నారు. కై కలూరు సబ్‌జైల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 23వ పెట్రోలియం ఔట్‌లెట్‌ను డీఐజీ ఆఫ్ జైల్స్ డాక్టర్ ఎం.వరప్రసాద్‌తో కలసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైళ్లను పునరావాసం, నైపుణ్యాభివృద్ధి, సమాజసేవా కేంద్రాలుగా మార్పు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల్లోనూ జైళ్ల శాఖ ద్వారా ఔట్‌లేట్‌లు ప్రారంభిస్తుందన్నారు. అనంతరం సమీపంలో రూ.1.63 కోట్లతో నిర్మిస్తున్న నూతన జైలు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. కాంట్రాక్టర్ టైల్స్ ఏర్పాటుకు అదనపు ఖర్చు అవుతోందని ఆయన దృష్టికి తీసుకురాగా టెండర్లలో ఎందుకు కోడ్ చేయలేదని ప్రశ్నించారు. త్వరగా నిర్మాణం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సబ్ జైల్స్ ఆఫీస ర్(విజయవాడ) ఎస్.శివశంకర్, ఏలూరు జిల్లా సబ్ జైల్స్ ఆఫీసర్ ఆర్‌వీ స్వామి, వివిధ ప్రాంతాల జైలర్లు పి.రమేష్, టి.తేజేశ్వరరావు, యూ.ఉమామహేశ్వరరావు, జి.ప్రేమ్‌సాగర్, కై కలూరు డెప్యూటి జైలర్ బొత్సా అప్పారావు, కై కలూరు టౌన్ సీఐ ఏవీఎస్.రామకృష్ణ, మండవల్లి ఎస్సై రామచంద్రరావు, నాయకులు పూలా రాజీ, తోట లక్ష్మి, బాబీ తదితరులు పాల్గొన్నారు.
డీజీ ప్రిజనర్స్ అంజినీ కుమార్


