ముగిసిన పొగాకు వేలం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన పొగాకు వేలం

Nov 28 2025 9:01 AM | Updated on Nov 28 2025 9:01 AM

ముగిస

ముగిసిన పొగాకు వేలం

ముగిసిన పొగాకు వేలం ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ సమావేశం ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి స్కూల్‌ బస్సులపై ప్రత్యేక తనిఖీలు

రూ.555.29 కోట్ల అమ్మకాలు

జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం వర్జీనియా వేలం కేంద్రం–1 పరిధిలో పొగాకు బేళ్ల వేలం ప్రక్రియ గురువారం ముగిసింది. ఆఖరి రోజు వేలంలో మొత్తం 452 బేళ్లు అమ్మకం జరిగినట్లు వేలం నిర్వహణాధికారి బి.శ్రీహరి తెలిపారు. కాగా, వేలం కేంద్రం–1 పరిధిలో ఈ సీజన్‌కు సంబంధించి మొత్తం 18.56 మి.కిలోల వర్జీనియా పొగాకు అమ్మకాలు జరిగాయి. వర్జీనియా పొగాకు కేజీ ఒక్కింటికి రూ. 299.06 సగటు లభించింది. ఈ సీజన్‌లో గత సీజన్‌ రికార్డును బ్రేక్‌ చేస్తూ అత్యధిక ధర రూ.453 నమోదైంది. అలాగే అత్యల్ప ధర రూ.50 నమోదు కాగా, సీజన్‌ మొత్తంగా రూ. 555.29 కోట్లు విలువైన పొగాకు అమ్మకాలు జరిగినట్లు వర్జీనియా అధికారులు తెలిపారు. కాగా, రైతు సంఘం ఆధ్వర్యంలో వేలం కేంద్రం అధికారులు, సిబ్బందిని, వ్యాపార ప్రతినిధులను ముఠా వర్కర్లు ఘనంగా సత్కరించారు. రైతు నాయకులు పరిమి రాంబాబు, వామిశెట్టి హరిబాబు, కరాటం రెడ్డిబాబు, అల్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఉందని, పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఆరు తాలుకా యూనిట్‌ ఎన్నికల నిర్వహించుటకు అడ్‌ హక్‌ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీజివోస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్‌ తెలిపారు. భీమవరం ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించిన జిల్లా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డిసెంబర్‌ 3న నిర్వహించనున్న ఈ అడ్‌హాక్‌ కమిటీకి భీమవరం ట్రెజరీలో పనిచేస్తున్న యు.పాండురంగారావు ఎన్నికల ప్రక్రియ జరుపుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌, ప్రధాన కార్యదర్శి డీవీ రమణ హాజరవుతారని అన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెనుమరెడ్డి శ్రీనివాస్‌, ఉమ్మడి జిల్లా కార్యదర్శి నెరుసు రామారావు, అన్ని యూనిట్ల అధ్యక్ష, కార్యదర్సులు, పెన్షనర్లు సంఘం నాయకులు కె.కామరాజు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు(మెట్రో): ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో పంట నష్టం నివారణ చర్యలపై గురువారం ఆమె అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ప్రస్తుతం కళ్లాలపై ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం తడిచిపోకుండా ఉండేందుకు రైతులకు అవసరమైన టార్ఫాలిన్లు రైతు సేవా కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్‌ బాషా, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

అవగాహన కల్పిస్తున్నాం

వాతావరణ శాఖ తుపాను హెచ్చరిక నేపథ్యంలో పంట నష్టం జరగకుండా రైతులకు ముందస్తు జాగ్రత్త చర్యలపై అవగాహన కలిగిస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ తెలియజేశారు. కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ గురువారం ధాన్యం కొనుగోలు, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ఆర్టీజిఎస్‌, ప్రభుత్వ కార్యక్రమాలపై పాజిటివ్‌ పబ్లిక్‌ పెరస్పన్‌ తదితర అంశాలపై ఏపీ సచివాలయం నుంచి వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా కలెక్టర్‌, రవాణా శాఖ కమిషనరు ఆదేశాల మేరకు జిల్లాలో విద్యా సంస్థల బస్సుల్లోని భద్రతా లోపాలపై ప్రత్యేక స్నేహపూర్వక తనిఖీలు వారం రోజుల పాటు కొనసాగుతాయని ఇన్‌ఛార్జి ఉప రవాణా కమిషనరు కేఎస్‌ఎంవీ కృష్ణారావు గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ తనిఖీల్లో రవాణా శాఖ అధికారులు విద్యా సంస్థల బస్సుల్లోని భద్రతా లోపాలను గుర్తించి వారికి నోటీసులు అందిస్తారన్నారు. విద్యాసంస్థల యాజమాన్యం రవాణా శాఖ అధికారులు నిర్వహించే ప్రత్యేక స్నేహపూర్వక తనిఖీలకు సహకరించాలని కోరారు. వాహన ఫిట్నెస్‌, ట్యాక్స్‌, పర్మిట్‌, ఇన్సూరెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ విషయంలో ప్రత్యేక దృష్టిసారించి కేసులు నమోదు చేస్తామన్నారు.

ముగిసిన పొగాకు వేలం 1
1/1

ముగిసిన పొగాకు వేలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement