
●ఇదేనా ‘చెత్త’శుద్ధి?
నూజివీడు పట్టణంలోని బస్టాండు వద్ద డ్రైనేజీలో చెత్త పేరుకోవడంతో అపారిశుద్ధ్యానికి నిలయంగా మారింది. గతంలో డ్రైనేజీ కల్వర్టులో నుంచి మురుగునీరు వెళ్లకపోవడంతో కల్వర్టు శ్లాబు కొంత తొలగించి అడ్డుపడ్డ చెత్తను తొలగించి మురుగునీరు వెళ్లేలా చేశారు. ఆ తరువాత పైభాగంలో శ్లాబు పోయకుండా వదిలేశారు. దీంతో డ్రెయిన్ నిండా చెత్త పేరుకుపోయింది. మరోవైపు ఈ డ్రెయిన్ ప్రమాదాలకు నెలవుగా మారింది. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీపై శ్లాబును నిర్మిస్తే పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు ప్రమాదాలు నివారించవచ్చు.
– నూజివీడు