
టిడ్కో ఇళ్ల బకాయిలు చెల్లించాలి
తాడేపల్లిగూడెం: బ్యాంకు రుణాలు ద్వారా టిడ్కో ఇళ్లు పొందిన లబ్ధిదారులు బకాయిలు వెంటనే చెల్లించాలని యూనియన్ బ్యాంకు అధికారులు ఎల్.అగ్రహారంలోని టిడ్కో లబ్ధిదారులను కోరారు. గురువారం ఉమ్మడి పశ్చిమకు చెందిన బ్యాంకు అధికారులు కాలనీని సందర్శించారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా లబ్ధిదారులకు ఎంత బకాయిలు ఉన్నారు? పెండింగ్‌లు ఎంత ఉన్నాయనే విషయాలను వివరించారు. బకాయిలను ఎట్టి పరిస్ధితుల్లో వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించే స్థితిలో మేం లేమని లబ్దిదారులు చెప్పారు. ఇళ్లకు ఎలాంటి సొమ్ము చెల్లించనక్కరలేదని గతంలో ఇళ్లు మాకు కేటాయించిన సందర్భంలో చెప్పారని, ఇప్పుడు బకాయిలు చెల్లించమంటే ఎలా అని ప్రశ్నించారు. బ్యాంకు చీఫ్ మేనేజర్ ప్రదీప్ మాలిక్, సీనియర్ మేనేజర్ భాస్కరరావు, మేనేజర్లు లోకేష్, చినబాబు, విజయ్, రామకృష్ణ పాల్గొన్నారు.