
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
ముదినేపల్లి రూరల్: చేపల చెరువుపై విద్యుత్ మోటారు మరమ్మతులు చేస్తూ షాక్‌నకు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని బొమ్మినంపాడులో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం గోరింతోట గ్రామానికి చెందిన వలిగేటి ఏసురాజు(35) బొమ్మినంపాడులో 20 రోజుల కింద చేపల చెరువుపై కాపాలదారుగా చేరాడు. ఈ నేపధ్యంలో గురువారం ఉదయం విద్యుత్ మోటారుతో నీరు తోడుతుండగా మధ్యంలో ఆగింది. దీనిని మరమ్మతులు చేస్తూ హఠాత్తుగా విద్యుత్ షాక్‌నకు గురై మరణించాడు. ఏసురాజు బంధువు దాసరి ప్రసాద్ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.