
ఏ క్షణాన కూలుతుందో..
ఆకివీడు: స్థానిక వ్యవసాయ మార్కెట్(ఏఎంసీ) సమీపంలో ఉన్న భవనం కూలడానికి సిద్ధంగా ఉన్నా ఆ భవనంలోనే విద్యా సంస్థను నడుపుతున్నారు. అందులో వార్డు సచివాలయ కార్యాలయం ఉంది. అన్ని అంతస్తుల్లోనూ పెచ్చులూడిపోయాయి. పిల్లర్లలో వేసిన కాంక్రీట్ పూర్తిగా దెబ్బతింది. బీములో కూడా ఇదే పరిస్థితి. భవనం అండర్ గ్రౌండ్ భాగంలో వర్షపు నీరు నిలిచిపోతోంది. వర్షాకాలం వస్తే చెరువును తలపిస్తుందని విద్యార్థులు, సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని సచివాలయ సిబ్బంది ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. అధిక సంఖ్యలో విద్యార్థులు భవనంలోని ప్రైవేటు విద్యా సంస్థలో చదువుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయాందోళనలో ఉన్నారు. భవనంలో విద్యాభ్యాసం కొనసాగించడం ప్రాణాలమీదకు తెచ్చుకోవడమేనని అంటున్నారు.

ఏ క్షణాన కూలుతుందో..