
ఉధృతంగా గోదావరి
‘కళ్ల కలక’లం
వర్షాకాలం కావడంతో జిల్లాలో కళ్ల కలకతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. 8లో u
ఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025
పోలవరంలో క్రమేపీ పెరుగుతూ..
పోలవరం రూరల్: గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఉప నదుల నీరు చేరడంతో వరద ప్రవాహం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 31.430 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 7,43,222 క్యూసెక్కుల నీరు దిగువకు చేరు తోంది. అయితే భద్రాచలం వద్ద శనివారం ఉద యం 11 గంటలకు 41.30 అడుగులకు చేరుకున్న నీటిమట్టం క్రమేపీ స్వల్పంగా తగ్గుతూ రాత్రికి 41 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద వరద స్వల్పంగా తగ్గుతూ నిలకడగా ప్రవహిస్తోంది. దిగువన వరద స్వల్పంగా పెరుగుతోంది.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరికి వరద పోటెత్తుతోంది. పూర్తి జలకళతో గోదావరి, శబరి నదులు ప్రవహిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురిసిన వర్షాలతో లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతుంది. ముంపు మండలాలైన ఏజెన్సీ గ్రామాలను అతలాకుతలం చేస్తూ పోలవరం నుంచి ధవళేశ్వరం మీదుగా లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి పోలవరం ప్రాజెక్టు నుంచి 7,43,222 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. మరోవైపు మండలాల్లోని మూడు గ్రామాలకు చెందిన ప్రజలను పునారావాస కేంద్రాలకు తరలించారు.
ముంపు మండలాల్లో హైఅలర్ట్
గోదావరికి వరద ఉధృతి కొనసాగుతున్న క్రమంలో ముంపు మండలాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరికి పది రోజులుగా భారీగా వరద నీరు చేరు తుంది. ఈనెల 2 నుంచి ప్రారంభమైన వరద నీరు శుక్రవారం 5,02,478 క్యూసెక్కులు, శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి 7,43,222 క్యూసెక్కులు నీరు పోలవరానికి చేరింది. భద్రాచలం వద్ద 41.30 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తుంది. మరోవైపు ఆదివారం, సోమవారం గోదావరి నిలకడగా కొనసాగే అవకాశం ఉందని, ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో తీవ్రత కొంత తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 2 నుంచి శనివారం వరకు 30.52 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుంచి పోలవరానికి చేరుకుంది. పోలవరం నుండి దిగువకు విడుదల చేశారు.
ముంపు గ్రామాల్లో భయం.. భయం
పోలవరం ముంపు గ్రామాల్లో వరద భయం వెంటాడుతోంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మూడు గ్రామాలకు వరద ముంపు పొంచి ఉంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం కుక్కునూరు మండలంలోని గొమ్ముగూడెం, లచ్చిగూడెం గ్రామాలకు చెందిన 70 కుటుంబాలు దాచారంలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి తరలించారు. వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ముగూడెంకు చెందిన సుమారు 100కు పైగా కుటుంబాలు పునరావాస కాలనీకి తరలివెళ్లాయి. అలాగే రాష్ట్రం విపత్తుల నివారణ దళం సభ్యులు (ఎన్‌డీఆర్‌ఎఫ్) రెండు మండలాలకు చేరుకున్నారు. ఒక్కో మండలంలో 35 మంది బృందంతో అత్యవసర సేవలందించడానికి వీలుగా సిద్ధం చేశారు. జిల్లా అధికార యంత్రాంగం పునరావాస కేంద్రంలో పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు వేలేరుపాడు, కోయిదా, ప్రధాన రహదారిపై ఉన్న ఎద్దులవాగు వంతెన గోదావరి వరద పొంగిపొర్లడంతో వంతెన పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో 18 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు శివారులో వేలేరు వద్ద కిన్నెరసాని వాగుకు వరద నీరు చేరడంతో సమీపంలోని పొలాల్లోకి వరద నీరు పోటెత్తింది. అలాగే కుక్కునూరు మండలంలో గుండేటివాగు లోలెవల్ వంతెన జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి.
న్యూస్‌రీల్
7.43 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల
వేలేరుపాడు, కుక్కునూరులో పునరావాస కేంద్రాలు
నిలకడగా శబరి, గోదావరి
రెండు రోజుల్లో వరద తగ్గుముఖం పట్టే అవకాశం
నీటమునిగిన ఎద్దులవాగు, గుండేటివాగు వంతెనలు
వేలేరుపాడులో 18 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

ఉధృతంగా గోదావరి