
చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
చింతలపూడి: ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొని 12 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన చింతలపూడి మండలం, వెలగలపల్లి ఊరచెరువు సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి ఆర్‌టీసీ డిపో సత్తుపల్లి నుంచి ఏలూరు వెళ్తుండగా వెలగలపల్లి ఊరచెరువు సమీపంలో డ్రైవర్ రోడ్డుపై ఉన్న భారీ గోతులను తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 12 మందికి స్వల్ప గాయాలు కాగా వారిని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని వేరే బస్సులో తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. ప్రాణ నష్టం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా రోడ్డుపై పెద్ద, పెద్ద గోతులు ఉండటం వల్లనే స్టీరింగ్ కంట్రోల్ తప్పి చెట్టును ఢీకొట్టినట్లు బస్సు డ్రైవర్ నరశింహారావు తెలిపాడు. రహదారులకు కూటమి ప్రభుత్వం మరమ్మతులు చేయకపోవడం కారణంగా నిరంతరం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
12 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు

చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు