
పెద్దింట్లమ్మకు బోనాలుసమర్పించిన హిజ్రాలు
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ తల్లిని తెలంగాణకు చెందిన హిజ్రాలు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బోనాలు, సారెను సమర్పించారు. మేళాతళాలతో నృత్యాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్క రోజు పెద్దింట్లమ్మ అమ్మవారికి వివిధ రూపాల్లో రూ.98,126 ఆదాయం వచ్చిందని తెలిపారు.
మావుళ్లమ్మకు సారె
భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణంలో వేంచేసియున్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి ఆదివారం భక్తులు ఆషాఢ సారె సమర్పించారు. రెస్ట్ హౌస్ రోడ్ కి చెందిన మిండీ ఈశ్వరరావు నాగ సుధ దంపతులు, వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి సారెగా 50 రకాల పండ్లు, స్వీట్లు సమర్పించారు. అమ్మవారి పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచనం అందించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు.
జై వనరూపిణి
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వాహనాలలో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ, పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

పెద్దింట్లమ్మకు బోనాలుసమర్పించిన హిజ్రాలు

పెద్దింట్లమ్మకు బోనాలుసమర్పించిన హిజ్రాలు