
కారు ఢీకొని ఆటో బోల్తా
సారా బట్టీల ధ్వంసం
కుక్కునూరు: మండలంలోని సీతారామనగరం గ్రామ శివారులో సారా తయారీ కేంద్రాలపై ఆదివారం కుక్కునూరు సీఐ ఎం రమేష్ బాబు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వెయ్యి లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకుని సారా బట్టీలను ధ్వంసం చేశారు. సారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. దాడుల్లో స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.
వివాహిత ఆత్మహత్య
భీమవరం: భీమవరం ఒకటో పట్టణ పరిధిలోని టిడ్కో గృహ సముదాయంలో వివాహిత యు.శశిపూర్ణిమ (31) ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై ఎస్‌వీవీఎస్ కృష్ణాజీ, సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. శశిపూర్ణిమకు ఆరేళ్ల కిందట వివాహం కాగా ఓ పాప ఉందన్నారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.
ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, మరో వ్యక్తికి స్వల్ప గాయాలు
ద్వారకాతిరుమల: మండలంలోని లక్ష్మీనగర్ జాతీయ రహదారిపై ఆదివారం కారు ఢీకొట్టడంతో ఒక ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం. ద్వారకాతిరుమల మండలం బుట్టాయిగూడెం కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ వంగలపూడి ప్రభాకరరావు, మహదేవపురంనకు చెందిన కట్టా సాయిని కప్పలకుంట వద్ద ఆటోలో ఎక్కించుకుని నల్లజర్ల మండలం అయ్యవరంనకు వెళుతున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి ఓ కారు అతివేగంగా వెనుక నుంచి వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రభాకరరావుకు తీవ్ర గాయాలు కాగా, సాయికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ఆంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.