
కోకో బోర్డు ఏర్పాటు చేయాలి
పెదవేగి: రాష్ట్రంలో కోకో బోర్డు ఏర్పాటు చేయాలని ఏపీ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని వంగూరులో కోకో రైతు సదస్సు నిర్వహించా రు. సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి పానుగంటి అచ్యుతరామయ్య అధ్యక్షత వహించారు. సదస్సులో కోకో రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాల ను ఆమోదించారు. అనంతరం కె.శ్రీనివాస్ మా ట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో కోకో సాగును ప్రోత్సహిస్తామని చెబుతున్నా.. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కోకో గింజలను మార్కెట్‌లో విక్రయించడానికి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో లక్ష ఎకరాలు పెంచితే ఆ పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోతే కోకో రైతులకు మరిన్ని అవస్థలు తప్పవన్నారు. రాష్ట్రంలో కోకో బోర్డు ఏర్పాటు చేయాలని, విదేశీ కోకో గింజలు దిగుమతులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధర వ చ్చేలా ఫార్ములా రూపొందించి కోకో గింజలకు ధర నిర్ణయించి అమలు చేయాలని కోరారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షు డు గుదిబండి వీరారెడ్డి మాట్లాడుతూ కోకో రైతులంతా రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి భవి ష్యత్తులో కోకో గింజలను తామే మార్కెటింగ్ చేసుకునేలా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఆలపాటి వాసు, పానుగంటి నరేష్, కొండపల్లి స త్యనారాయణ, గోపిశెట్టి శ్రీనివాస్, సింహాద్రి సతీ ష్, ఏపూరి శ్రీనివాసరావు, కొట్టే సురేష్, మామిళ్లపల్లి వెంకట్రావు, పానుగంటి సుధాకర్ పాల్గొన్నారు.