
మధ్యవర్తిత్వం.. పరిష్కార మార్గం
కై కలూరు: సుప్రీంకోర్టు ఆదేశాలతో ‘మధ్యవర్తిత్వం–దేశం కోసం’ అనే కార్యక్రమంలో భాగంగా జాతీ య న్యాయ సేవాధికార సంస్థ, సుప్రీంకోర్టు మీడి యేషన్ అండ్ కన్సిలేషన్ ప్రాజెక్టు కమిటీల ఆధ్వ ర్యంలో ఆయా కోర్టుల్లో ప్రత్యేక సెంటర్లను ఏర్పా టు చేస్తున్నారు. ఈనెల 1 నుంచి 90 రోజుల పాటు మధ్యవర్తిత్వంపై కక్షిదారులకు అవగాహన కలిగిస్తారు. ఇప్పటికే జడ్జిలు, మీడియేటర్స్‌గా పనిచేసే ఆసక్తి కలిగిన న్యాయవాదులకు ఐదు రోజుల శిక్షణ ఇచ్చారు. విడతలుగా శిక్షణ కొనసాగుతోంది. మీడియేషన్ ఫర్ ది నేషన్ అనేది దేశంలో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడం అనే లక్ష్యంతో రూపొందించారు. రాష్ట్ర, జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థలు క్రియాశీలకంగా వ్యహరించనున్నాయి.
పెండింగ్ కేసులు తగ్గించేలా..
కోర్టులో పెండింగ్ కేసులు సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రాజీ పడదగిన కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించింది. ఆయా కోర్టుల్లో కొందరు న్యాయవాదులతో కలిసి మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. కోర్టులో కేసులు నడుస్తున్నా రాజీ కోరితే మీడియేషన్ సెంటర్‌కు కక్షిదారులను పంపుతారు. ఇప్పటికే శిక్షణా న్యాయవాదులకు ఓల్కన్‌ప్రో (వలంటరీ కాన్ఫిడెస్సియల్, ప్రోసిజర్)పై శిక్షణ ఇచ్చారు. కక్షదారులతో మీడియేటర్లు చక్కటి వాతావరణంలో మాట్లాడి కేసు పరిష్కరానికి కృషి చేస్తారు. కేసులో ఒక్కసారి ఆర్డర్ పొందిన తర్వాత తిరిగి ఇతర కోర్టులో కేసు వేసే అవకాశం ఉండదు. మధ్యవర్తిత్వంతో పరిష్కారమైన వ్యాజ్యాల్లో న్యా యస్థానానికి చెల్లించిన రుసుం సెక్షన్ 66(ఎ) చట్టం కింద తిరిగి చెల్లిస్తారు.
మధ్వవర్తిత్వంతో ప్రయోజనాలు
మధ్వవర్తిత్వంతో త్వరిత ప్రయోజనం సమకూరుతుంది. ఖర్చులు ఉండవు. కేసుల్లో సామరస్వపూర్వక పరిష్కారం లభిస్తుంది. కేసుల పరిష్కార నివారణ మార్గాలను సెంటర్‌లో పొందవచ్చు. మధ్వవర్తిత్వ ప్రక్రియ రహస్యంగా ఉంచుతారు. ఎలాంటి ఆంక్షలు ఉండవు. కక్షిదారులే నిర్ణయకర్తలుగా ఉంటారు. ఇక మధ్యవర్తి నిష్పక్షపాత తటస్థ వ్యక్తిగా ఉంటాడు. ఇరుపక్షాల మధ్య సంభాషణ నిర్వహిస్తాడు. కక్షిదారుల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి మార్గాన్ని కల్పిస్తాడు. అంగీకారానికి రావడానికి ఉన్న అవరోధాలను, ప్రయోజనాలను గుర్తిస్తాడు. అంగీకార పరిష్కార నియమాలను తయారు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాడు.
కోర్టుల్లో మీడియేషన్ సెంటర్ ఏర్పాటు
90 రోజులపాటు అవగాహన కార్యక్రమాలు
చక్కటి అవకాశం
మధ్యవర్తిత్వం చక్కటి అవకాశం. మీడియేషన్ సెంటర్‌లో సామరస్యపూర్వక వాతావరణాన్ని కల్పిస్తాం. కక్షిదారులతో మాట్లాడే విధానంపై శిక్షణ తీసుకున్నాను. కోర్టులో ఏర్పాటు చేస్తున్న సెంటర్‌లో సమస్యను పరిష్కరించుకుంటే కక్షిదారులు ఇద్దరు గెలిచినట్లుగానే భావించాలి. రాజీపడదగిన కేసుల కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– దేవరపల్లి శివప్రసాద్, శిక్షణ పొందిన న్యాయవాది, కై కలూరు

మధ్యవర్తిత్వం.. పరిష్కార మార్గం