
వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం అధికార ప్రతినిధిగా సయ్యద
ఉంగుటూరు: వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంగుటూరుకు చెందిన షేక్ సయ్యద్ బాజీని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం ప్రకటన వెలువడింది. మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబను సయ్యద్ బాజీ, మైనారిటీ నేతలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బాజీ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు 2000కు పైగా మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను వెంటనే పరిష్కరించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి డిమాండ్ చేశారు. గత జనవరి నుంచి అన్ని మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు అప్రూవ్ కాకుండా అలాగే ఉన్నాయని, విద్యాశాఖకు సంబంధించిన దాదాపు 700 బిల్లులు పరిష్కారానికి నోచుకోకుండా పడి ఉన్నాయని, త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించకపోతే యుటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి అన్నారు. ఉద్యోగుల పీఎఫ్ లోన్లు అప్లికేషన్ పెట్టిన తర్వాత 20 రోజులలోపు సీఎఫ్‌ఎంఎస్ లోనికి వెళ్ళేలా చూడాలని వారు కోరారు.
వ్యక్తిపై దాడి కేసులో ఇద్దరి అరెస్టు
ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ ప్రాంతంలో ఇటీవల ఒక వ్యక్తికి లిఫ్ట్ ఇస్తామని చెప్పి, నిర్మానుష్యప్రాంతానికి తీసుకువెళ్ళి దాడి చేసి నగదు, సెల్‌ఫోన్ అపహరించిన ఇద్దరు నిందితులను ఏలూరు రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కై కలూరు మండలం చింతలమూడు గ్రామానికి చెందిన సాదర్ల బ్రహ్మం హైదరాబాద్ నుంచి వస్తూ ఈనెల 13న తెల్లవారుజామున ఊరువెళ్లేందుకు వన్‌టౌన్ ప్రాంతం అజంతా సెంటర్‌లో వేచి ఉన్నాడు. ఇద్దరు యువకులు లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్ ఎక్కించుకున్నారు. పోణంగి రోడ్డులో తమ్మిలేరు కాలువగట్టు ప్రాంతానికి తీసుకువెళ్ళి అతన్ని కొట్టి, రూ.5,500 నగదు, సెల్‌ఫోన్, బ్యాగు అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో దాడికి పాల్పడిన ఏలూరు తూర్పువీధికి చెందిన ఆనంద్ నగేష్, జంపా పవన్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం అధికార ప్రతినిధిగా సయ్యద