
నగరపాలక సంస్థ ఉద్యోగుల ధర్నా
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ఇంజనీరింగ్ కార్మి కులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సోమవారం ఉద్యోగులు, కార్మికులు ధర్నా చేశారు. ఏఐటీయూసీ ఏలూరు ఏరియా కార్యదర్శి ఎ.అప్పలరాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, పి.కిషోర్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్‌గా గుర్తించిన కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. పెండింగ్ సరెండర్ లీవ్, డీఏలను విడుదల చే యాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి మంగళవారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
స్మార్ట్ మీటర్లతో ప్రజలపై భారం
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): విద్యుత్ స్మార్ట్‌మీటర్ల నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకోకపోతే బషీర్‌బాగ్ విద్యుత్ పోరాట అమరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అన్నారు. సోమవారం సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. స్మార్ట్‌మీటర్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేయొద్దని నినదించారు. నాడు ప్రతిపక్ష నేతగా నారా లోకేష్ స్మార్ట్‌మీటర్లను వ్యతిరేకించారని.. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటినే కొనసాగించేలా చూస్తుండటం దారుణమన్నారు. సీపీఎం నగర కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్, వైఎస్ కనకారావు, ఎం.ఇస్సాక్, పి.ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు.
వరద తగ్గుముఖం
పోలవరం రూరల్ : వారం రోజులుగా పెరుగుతున్న గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి చేరే జలాలు తగ్గుతుండటంతో వరద ప్రవాహం క్రమేపీ తగ్గింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 29.550 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్ వే నుంచి 3,78,800 క్యూసెక్కుల వరదనీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద కూడా నీటిమట్టం ఘణనీయంగా తగ్గుతోంది. 22.60 అడుగులకు చేరుకుంది.
ప్రైవేట్ పాఠశాలలపై ఫిర్యాదు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలో విద్యాశాఖ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాలలు నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రిసెల్వికి ఫిర్యాదు చేశామని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని తెలిపా రు. ఈ మేరకు వివరాలను పత్రికలకు విడు దల చేశారు. రెండో శనివారం తరగతులు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పీడీఎస్‌యూ నగర అధ్యక్షుడు వై.యశ్వంత్ ఆధ్వర్యంలో నా యకులు వెళ్లి అడ్డుకోగా తమకు అధికారులు అనుమతిచ్చారని ప్రైవేట్ విద్యాసంస్థల యా జమాన్యాలు తెలిపాయని పేకాన్నరు.
నరసాపురం లేసుకు ఓడీఓపీ అవార్డు
భీమవరం (ప్రకాశంచౌక్) : న్యూఢిల్లీలో కేంద్ర ప్రభు త్వ వాణిజ్య పన్నులు, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ‘నరసాపూర్ క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్’కు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చేతులమీదుగా కలెక్టర్ సీహెచ్ నాగరాణి అవార్డు అందుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ నరసాపురం లేసు అల్లికలకు గతేడాది జీఐ గుర్తింపు రావడం, ఇప్పుడు వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) కింద అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ గుర్తింపులతో వే లాది మంది నేత కార్మికులు, కళాకారులకు ప్రో త్సాహం ఇవ్వగలమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో లేసు ఉత్పత్తులు గుర్తింపు పొందడంతో పాటు ఇప్పుడు ఈ అవార్డు అందుకోవడం లేసు తయారీదారుల కృషి ఫలితం అన్నారు.

నగరపాలక సంస్థ ఉద్యోగుల ధర్నా