
లారీ ఢీకొని తాపీ కార్మికుడి మృతి
కలిదిండి (కై కలూరు): లారీ ఢీకొని తాపీ కార్మికుడు మృతి చెందిన ఘటన కలిదిండి మండలం గుర్వాయిపాలెం సమీప రామిరెడ్డినగర్ వద్ద గురువారం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుపాడుకు చెందిన అవురుగొట్టు సత్యబాబు(45) సైకిల్‌పై వచ్చి గుర్వాయిపాలెంలో తాపీ పని చేసి తిరిగి ఇంటికి వెళుతుండగా కలిదిండి వ్యవసాయ మార్కెట్ నుంచి బియ్యం బస్తాలతో ఆకివీడు రైల్వేస్టేషన్‌కు వెళుతున్న లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో సత్యబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య లక్ష్మీ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కై కలూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.