
పెద్దింట్లమ్మకు పూజలు
కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ ఆశీస్సులు మాకు అందించమ్మా అంటూ భక్తులు అమ్మను ఆర్తితో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పెద్దింట్లమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్ధాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మ ఫొటోల అమ్మకాలు, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.1,17,660 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
రైలు ఢీకొని యువకుడి మృతి
భీమడోలు: భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే గేటు వద్ద ఆదివారం గుర్తు తెలియని రైలు ఢీకొని ద్వారకాతిరుమల మండలం సత్తెనగూడెం గ్రామానికి చెందిన కొత్తపల్లి అశోక్ (30) మృతి చెందాడు. ఏలూరు రైల్వే పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే ఎస్సై సైమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.