
వేధింపులపై కేసు నమోదు
జంగారెడ్డిగూడెం: భర్త తనను వేధిస్తున్నాడని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ బాబూరావు తెలిపారు. తాళ్లపూడికి చెందిన బైరవ రాజేష్‌కు, కావేరికి వివాహం కాగా ఇద్దరు పిల్లలున్నారు. వివాహమైనప్పటి నుంచి కావేరితో రాజేష్ గొడవ పడుతున్నాడు. వేరు కాపురం పెడితే మారతాడని భావించి జంగారెడ్డిగూడెంలో ఇంటిని అద్దెకు తీసుకుని గత మూడు సంవత్సరాలుగా ఉంటున్నారు. అయినప్పటికీ రాజేష్‌లో మార్పు రాలేదు. పనికి వెళ్లక పోగా, మద్యం సేవించి వచ్చి కావేరిని వేధిస్తున్నాడన్నారు. ఇటీవల కావేరి తల్లి పేరున ఉన్న ఇంటిని తన పేరుపై రాసి రిజిస్ట్రేషన్ చేయాలని వేధిస్తుండటంతో ఆదివారం కావేరి ఫిర్యాదు చేసిందన్నారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ తెలిపారు.
బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక
ఏలూరు రూరల్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జూనియర్ బాలికల బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక పూర్తి చేశామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి గవ్వ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరు కస్తూర్బా బాలికల పాఠశాల ఆవరణలో ఆదివారం సాయంత్రం చేపట్టిన జిల్లా జట్టు ఎంపిక పోటీల వివరాలు వెల్లడించారు. జట్టు ఆగస్టు 14 నుంచి 17 వరకూ కోనసీమ జిల్లా పిఠాపురంలో జరిగే 10వ అంతర జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటుందని వెల్లడించారు. జట్టుకు పి.జయశ్రీ, వి.యామిని, ఏ రుత్విక, జి.పూజిత, డి.సాయిభవాణి, పి.నందిని, బి.దేవిశ్రీ, జి.సరిత, ఎస్.ఖుషీహసిని, డి.సాయిశ్రీ లాస్య, ఏ రియా, పి.శాంతిసులోచనతో పాటు స్టాండ్‌బైగా ఎన్.రేణుక, ఊహాసత్యశ్రీ, కే రుచిత, జి.యేసు ప్రశాంతి ఉన్నారు.
విద్యార్థినులకు రక్షణగా శక్తి టీంలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో బాలికలు, యువతులు, మహిళలకు రక్షణగా నిలిచేందుకు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో శక్తి మహిళా రక్షక దళం ఏర్పాటు చేశారు. మరోవైపు శక్తి యాప్‌పైనా మహిళలు, విద్యార్థినులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏలూరు మహిళా స్టేషన్ సీఐ ఎం.సుబ్బారావు, ఏలూరు టూటౌన్ సీఐ అశోక్‌కుమార్, ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐలు నగరంలోని ఆయా బాలికల హాస్టళ్లకు వెళ్ళి ఆదివారం రాత్రి శక్తి యాప్, శక్తి టీంలపై అవగాహన కల్పించారు. విద్యార్థినుల సెల్‌ఫోన్స్‌లో శక్తి యాప్‌ను పొందుపరిచి, ఏ విధంగా వినియోగించాలో అవగాహన కల్పించారు. ఆపద సమయంలో యాప్‌లోని ఎస్‌వోఎస్‌పై నొక్కితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్లి సాయం అందుతుందన్నారు.

వేధింపులపై కేసు నమోదు