
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శిగా జయకర్
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్ గరికపూడి ఇమ్మానుయేల్ జయకర్‌ను వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, రాబోయే కాలంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే తమ ప్రధాన లక్ష్యం అన్నారు. తనపై విశ్వాసంతో రాష్ట్రస్థాయి పదవిని కేటాయించటంలో కృషి చేసిన ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్, జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.