
రోడ్డు ప్రమాదంలో బాలింత మృతి
పాలకొల్లు సెంట్రల్: మోటార్‌సైకిల్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలింత దుర్మరణం పాలైంది. వివరాల ప్రకారం అప్పనచెర్వు రామచంద్రరావు పేటకు చెందిన ఎం నందిని మూడు నెలల బాలింత (25). శిశువును ఇంటి వద్దే ఉంచి భర్త రత్నరాజు, పెద్ద కుమారుడితో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం మోటార్‌సైకిల్‌పై పాలకొల్లులో ఆసుపత్రికి వెళ్లారు. తిరిగి వస్తుండగా పెనుమదం రోడ్డులో ఎస్‌ఆర్‌ఆర్ పేట ప్రాంతానికి వచ్చే సరికి ఓ కారు వీరి మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందిని మృతి చెందగా రత్నరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. బాబు పక్కనే ఉన్న తుప్పల్లో పడడంతో స్వల్పగాయాలతో సురక్షితంగా ఉన్నాడు. రత్నరాజు ఫిర్యాదు మేరకు పోడూరు ఎస్సై కె సుధాకర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నందిని మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో ఉంచారు.