
ఏజెన్సీలో భారీ వర్షం
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో కొద్దిరోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు గురువారం సాయంత్రం ఉపశమనం కలిగింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ, ఉక్కపోతగా ఉన్నా సాయంత్ర సమయానికి ఒక్కసారిగా కారుమబ్బులు కమ్మి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కొన్ని గంటల పాటు కురిసి ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. అలాగే రోడ్లన్నీ వర్షం నీటితో జలమయంగా మారాయి.
ప్రజలు సహకరించాలి
ఏలూరు(మెట్రో): అక్రమ వ్యాపార కార్యకలాపాలను నిర్మూలించేందుకు వాణిజ్య పన్నుల శాఖకు ప్రజలు సహకరించాలని ఏలూరు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ బి.అర్జున్‌రెడ్డి కోరారు. జిల్లా ప్రజల కోసం వాట్సాప్ 8712631283 నంబర్‌ను అందు బాటులోకి తీసుకువచ్చామని, అక్రమ వ్యా పార కార్యకలాపాల వివరాలను ఈ నంబర్‌కు తెలియజేయాలని సూచించారు.
జీఎన్‌టీ రోడ్డు రైల్వేగేటు మూసివేత
ఏలూరు (టూటౌన్): ఏలూరు–దెందులూరు రైల్వేస్టేషన్ల మధ్య లెవిల్ క్రాసింగ్ నంబర్ 351 కి.మీ వద్ద అత్యవసర మరమ్మతులు పూర్తికానందున ఈనెల 20న సాయంత్రం 5 గంటల వరకు రైల్వేగేటు మూసివేస్తామని దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎస్.లోకేష్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఏలూరు జీఎన్‌టీ రోడ్డు నుంచి నిమ్మకాయల మార్కెట్ యార్డుకు వెళ్లే దారిలో ప్రయాణించే వాహనచోదకులు ప్రత్యమ్నాయ రహదారి మీదుగా ప్రయాణించాలని కోరారు.
ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు
ఏలూరు(మెట్రో): రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏ ర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. ఏపీ సచివాలయం నుంచి గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, అధికారులు హాజరయ్యారు. జిల్లాలో తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ వివరించారు. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజనలో కొన్ని గ్రామాల పనుల్లో స్థానిక అవసరాలను అనుసరించి మార్పులు చేసి ప్రతిపాదనలు రూపొందించామన్నారు.
నేడు ఓపీఎస్ కోసం నిరసన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/ద్వారకాతిరుమల: డీ ఎస్సీ 2003 ఉపాధ్యాయులు, 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్ విడుదలై సీపీఎస్ పరిధిలోని గ్రూప్ 2 ఉద్యోగులు, కానిస్టేబుళ్లకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా పాత పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏలూరులో నిరసన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని డీఎస్సీ 2003 టీచర్స్ ఫో రమ్ రాష్ట్ర కన్వీనర్ కట్టా శ్రీనివాసరావు, జిల్లా కన్వీనర్లు వి.జగదీష్, ఈ.శంకర్, బాలసుబ్రహ్మణ్యం, రమేష్, గోపాలకృష్ణ తదితరులు ఓ ప్రకటనలో కోరారు.
సంపూర్ణ మద్దతు : ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఫ్యాప్టో ఏలూరు జిల్లా చైర్మన్ జి.మోహన్, సెక్రటరీ జనరల్ ఎం. ఆదినారాయణ, ఫ్యాప్టో సభ్య సంఘాలు, ఇతర ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు తెలిపారు. అలాగే ఉద్యమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొ ర్రా గోపిమూర్తి హాజరై ప్రత్యక్ష మద్దతు ఇవ్వ నున్నారు. ఏపీ యూటీఎఫ్ మద్దతు ఇస్తున్నట్టు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌కే ముస్తాఫా అలీ, ఆర్.రవికుమార్ తెలిపారు.

ఏజెన్సీలో భారీ వర్షం

ఏజెన్సీలో భారీ వర్షం