
తీర్పులు వేగంగా వెలువరించాలి
ఏలూరు (టూటౌన్): కేసుల తీర్పులు త్వరితగతిన వెలువరించాలని, అలాగే తీర్పుల్లో నాణ్యత లోపించకూడదని న్యాయమూర్తులకు ఏపీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి, ఉమ్మడి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె.సురేష్‌రెడ్డి సూచించారు. ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులతో శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆయన జ్యూడీషియల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సివిల్ కేసులు, విచారణలో ఉన్న ఖైదీల కేసులను త్వరితగతిన తీర్పులను వెలువరించడానికి ప్రయత్నించాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి ఉమ్మడి జిల్లాలో పెండింగు కేసులు వివరాలు, భవన సము దాయాల పరిస్థితులపై వివరించారు. జిల్లా న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు.
అందుబాటులో ఎరువులు
ఏలూరు(మెట్రో): జిల్లాలో పుష్కలంగా ఎరువులు ఉన్నాయని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. జిల్లాకు వచ్చిన ఎరువులను తరలిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. 50 శాతం సొసైటీల ద్వారా, 50 శాతం ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ చేసినా, అధిక ధరలకు అమ్మినా, అక్రమంగా తరలించినా, వారి లైసెన్సులు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. 86 సొసైటీల ద్వారా 10 డీసీఎంఎస్‌ల ద్వారా పంపిణీ చేస్తామన్నారు.
నేడు ప్రజా సంఘాల సదస్సు
ఏలూరు (టూటౌన్): విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారాల మోపడానికి ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు శనివారం ప్రకటన విడుదల చేశారు. గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల ప్రజలపై భారం పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ట్రూఅప్, సర్దుబాటు చార్జీలు తదితర రూపాలలో అధిక బిల్లుల భారాలను ప్రజలు మోస్తున్నారని పేర్కొన్నారు.
ఉపాధి కూలీలపై వివక్ష తగదు
ఏలూరు (టూటౌన్): ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని పాలకవర్గాలు కుట్ర చేస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. శనివారం ఏలూరులో ఉపాధి హామీ కూలీలు, పేదలతో కలిసి ని రసన తెలిపారు. ఉపాధి కూలీలకు వేతన బకా యిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేద న్నారు. పొమ్మన లేక పొగబెట్టే తీరుగా ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయని, ఉపాధి కూలీలపై వివక్ష తగదని అన్నారు. జిల్లా అధ్యక్షుడు ఎం. జీవరత్నం, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బదిలీ ఉపాధ్యాయులకు జీతాలెప్పుడు?
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇటీవల బదిలీ చేసిన ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు క్రియేట్ చే సి వెంటనే జీతాలు చెల్లించాలని ఫ్యాప్టో నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక పవర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఫ్యాప్టో జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షుడు జి.మోహన్ అధ్యక్షతన నిర్వహించారు. పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించి తక్షణమే ఐఆర్‌ను ప్రకటించాలని, బకా యి ఉన్న మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్/జీపీఎస్‌లను రద్దు చేస్తూ ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశా రు. పీఎఫ్ లోన్లు, ఏపీ జీఎల్‌ఐ లోన్లకు దర ఖాస్తు చేసుకున్న వారి అమౌంట్‌లను క్రెడిట్ చేయాలని, సరెండర్ లీవులు ఎన్‌క్యాష్‌మెంట్ చేసుకున్న వారికి వెంటనే ఆ మొత్తాన్ని ఖాతా ల్లో జమచేయాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులో పనిచేస్తున్న ఎల్‌పీలు, పీఈటీలకు వెంటనే జీతాలు చెల్లించాలని, 1 నుంచి 10వ తరగతి వరకూ నడుస్తున్న పాఠశాలల్లో వేర్వేరు యూడైస్‌లు క్రియేట్ చేసి ఎవరి పరిధిలో వారు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు పంపిణీ కాలేదన్నారు. ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ పాల్గొన్నారు.