
జెడ్పీ చైర్‌పర్సన్ కారుపై దాడి అమానుషం
కై కలూరు: కూటమి పాలనలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని ముదినేపల్లి మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కో మటి విష్ణువర్థన్ అన్నారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ గుడివాడలో జరిగే పార్టీ కార్యక్రమానికి హాజరవుతున్న కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక కారు అద్దాలను పగలగొట్టి కూటమి గూండాలు బీభత్సం చేయడం అత్యంత బాధాకరమన్నారు. దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
దాడులు దేనికి సంకేతం?
దెందులూరు: కృష్ణా జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ హారికపై దాడి చేసి, దౌర్జన్యానికి పాల్పడటం దుర్మార్గపు చర్య అని ఉమ్మడి పశ్చిమగోదా వరి జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు అన్నారు. శనివారం సాక్షితో ఆయన మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. కూటమి ప్రభుత్వంలో సామాన్య ప్రజానీకంతో పా టు జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేకుండా పోయిందనే విషయాన్ని ఈ దాడి నిరూపించిందన్నారు. వెంటనే న్యాయస్థానాలు ఈ ఘ టనను సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. దాడి చేసి, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై ప్రభు త్వం సీరియస్‌గా స్పందించి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటించడానికి ఎంతో సమయం పట్టదని అన్నారు.

జెడ్పీ చైర్‌పర్సన్ కారుపై దాడి అమానుషం