మాజీ ఎంపీ భరత్‌రామ్‌పై అక్రమ కేసు | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ భరత్‌రామ్‌పై అక్రమ కేసు

Jul 30 2026 12:33 AM | Updated on Jul 30 2026 12:33 AM

రాజమహేంద్రవరం రూరల్‌: వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌పై బొమ్మూరు పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై మంగళవారం మోరంపూడి వీఎల్‌పురం సెంటర్‌ సమీపంలో భరత్‌రామ్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎస్సై కేశవరావు చేసిన ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి బొమ్మూరు ఎస్సై మహమ్మద్‌ జుబేర్‌ నాన్‌ బెయిల్‌బుల్‌ కేసు నమోదు చేశారు. కాగా.. భరత్‌రామ్‌ మాట్లాడుతూ ఇటువంటి అక్రమ కేసులపై ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు.

చైతన్యరాజుకు

జాతీయ పురస్కారం

రాజానగరం: వెలుగుబంద సమీపంలోని గోదావరి గ్లోబల్‌ యూనివర్సిటీ (జీజీయూ) చాన్సలర్‌, చైతన్య విద్యా సంస్థల చైర్మన్‌ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు)కు జాతీయ వాగ్దేవి జీవిత సాఫల్య పురస్కారం లభించింది. జ్ఞానపీఠ్‌ పురస్కారం గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి శత జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని జాతీయ తెలుగు సాహిత్య పరిషత్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు.

దిద్దుబాటు చర్యలు

రాయవరం: మండలంలోని కురకాళ్లపల్లిలో సీసీ డ్రైనేజీ గోడ కూలిన ఘటనపై అధికారులు స్పందించారు. ‘సీసీ ఫ్లీజ్‌..డ్రైన్‌ కూలింది’ అంటూ ప్రారంభించకుండానే రక్షణ గోడ కూలిన ఘటనపై ‘సాక్షి’లో బుధవారం వార్త ప్రచురితమైంది. దానికి స్పందించిన అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కూలిన డ్రైనేజీ గోడను జేసీబీతో తొలగించారు. తిరిగి కొత్తగా నిర్మించేందుకు చర్యలు చేపట్టారు.

మైత్రేయ బుద్ధ విహార్‌ ప్రారంభం

నిడదవోలు: ఉండ్రాజవరంలోని మైత్రేయ బుద్ధ విహార్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ బుధవారం ప్రారంభించారు. బౌద్ధ దమ్మ పీఠాధిపతి బంతె అనాలయో, శ్రీలంక నుంచి విచ్చేసిన డాక్టర్‌ బోధగామ చండిమా నాయకే థీరోలతో కలిసి గౌతమి బుద్ధుడి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ బుద్ధుడు సంచరించిన పవిత్ర ప్రాంతంగా ఉండ్రాజవరానికి గుర్తింపు ఉందన్నారు. ద్వేషాన్ని ప్రేమతోనే జయించగలమన్న బుద్ధుని సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement