రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. పూర్వ విద్యార్థి అయిన ఎలైట్ ప్రాసెస్ టెక్నాలజీస్ ఇండియా ఎండి తోట సుబ్రహ్మణ్యం తన తండ్రి హరిబాబు సంన్మరణార్థం దీనిని నిర్మించారని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. యూనివర్సిటీ పరంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇది చక్కటి వేదికగా ఉపయోగపడుతుందన్నారు. దీనిని స్పూర్తిగా తీసుకుని పూర్వ విద్యార్థులు యూనివర్సిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో దాత సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతోపాటు రిజిస్టార్ ఆచార్య కెవి స్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు.


