యానాంలో నేడు పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

యానాంలో నేడు పోలింగ్‌

Apr 9 2026 7:35 AM | Updated on Apr 9 2026 7:35 AM

యానాం: స్థానిక శాసనసభ నియోజకవర్గానికి గురువారం ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. బుధవారం మధ్యాహ్నం నుంచి స్ధానిక ఎస్‌ఆర్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి ఈవీఎంలను, పోలింగ్‌ సామగ్రిని ప్రత్యేక బస్సుల్లో రిటర్నింగ్‌ అధికారి శివరాజ్‌మీనా పర్యవేక్షణలో ఆయా పోలింగ్‌ బూత్‌లకు తరలించారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 37,972 కాగా, అందులో మహిళలు 19,529 మంది, పురుషులు 18,4443 మంది ఉన్నారు. 2024లో ఓటర్లు 39,355 మంది ఉండగా ఇటీవలి ఎస్‌ఐఆర్‌ నిర్వహణలో సుమారు 1,383 మందిని వివిధ కారణాలతో ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. 42 ఇవీఎంలు.. 42 వీవీ ప్యాట్‌లు.. 230 మంది సిబ్బంది.. పోలింగ్‌ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో 42 పోలింగ్‌ స్టేషన్లకు 230 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. వీరు కాక సమస్యాత్మక ప్రాంతాల్లో 14 మంది పరిశీలకులను నియమించారు. సావిత్రినగర్‌, గిరియాంపేటల్లో 6 బూత్‌లకు ఆరు బృందాలను నియమించారు. 42 ఈవీఎంలు, 42 వీవీ ప్యాట్‌లను ఉంచనున్నారు. 14 రూట్‌లుగా వాటిని విజించారు. భద్రతకు 4 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 13 మంది అభ్యర్థులు ఉన్నారు. 13 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భద్రతను పెంచినట్లు రిటర్నింగ్‌ అధికారి మీనా తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్‌, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, తమిళవెట్రి కజగం (టీవీకే) తదిర పార్టీలతో పాటు స్వతంత్రులు రంగంలో ఉన్నారు.

42 కేంద్రాలు, 230 మంది

సిబ్బంది నియామకం

ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి తరలింపు

భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు

ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు

13 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement