పెళ్లయిన నెల రోజులకే..వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పెళ్లయిన నెల రోజులకే..వివాహిత ఆత్మహత్య

Apr 4 2026 7:43 AM | Updated on Apr 4 2026 7:43 AM

కె.గంగవరం: పెళ్లయిన నెల రోజులకే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. ఎస్సై సోమేంద్ర కథనం ప్రకారం.. కోటిపల్లికి చెందిన ఓలేటి వీరలక్ష్మి (19)కి అదే గ్రామంలోని ఏసుబాబుకు ఫిబ్రవరి 26న వివాహం జరిగింది. వివాహం జరిగిన అనంతరం వారం రోజుల పాటు తన భర్తతో కాపురం చేసి, తిరిగి తల్లిదండ్రుల వద్దే ఆమె ఉంటుంది. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తన భర్త ఏసుబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడిన అనంతరం వీరలక్ష్మి తన గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని చనిపోయింది. భర్త ఏసుబాబు, అత్తమామల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తండ్రి దోమ సత్తిబాబు కె.గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును రామచంద్రపురం సీఐ వెంకటనారాయణ దర్యాప్తు చేస్తున్నారని ఎస్సై సోమేంద్ర తెలిపారు. శుక్రవారం మంగళగిరి నుంచి ఫోరెన్సిక్‌ టీం, అమలాపురం నుంచి క్లూస్‌ టీం వారు వచ్చి సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement