నిరసన జ్వాల | - | Sakshi
Sakshi News home page

నిరసన జ్వాల

Apr 5 2026 8:24 AM | Updated on Apr 5 2026 8:24 AM

సాక్షి రాజమహేంద్రవరం: టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చినా చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్సార్‌ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా వ్యాప్తంగా శనివారం నిరసనలు చేపట్టారు. బీఆర్‌ నాయుడును బర్తరఫ్‌ చేసి, టీటీడీ ప్రతిష్టతను కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరించిన బీఆర్‌ నాయుడుపై చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా హిందూ భక్తులు, నెటిజన్ల విమర్శలను సైతం చంద్రబాబు పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమాల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్‌చార్జులు, ప్రజలు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం రూరల్‌

రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలోని బాలాజీపేట సెంటర్‌లో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వ్యవహార శైలిని ఖండిస్తూ.. ఆయనను వెంటనే టీటీడీ చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. స్థానిక కనకదుర్గమ్మ ఆలయంలో కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్‌ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నాడని, ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శులు గొందేశి శ్రీనివాసులురెడ్డి, నక్కా రాజబాబు, గిరజాల బాబు తదితరులు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం సిటీ

టీటీడీ చైర్మన్‌ పదవి నుంచి బీఆర్‌ నాయుడును బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ సీపీ నగర శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో నిరసన తెలిపారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. బీఆర్‌ నాయుడును పదవి నుంచి తొలగించి, తిరుమల పవిత్రతను, హిందూ భక్తుల మనోభావాలను కాపాడాలని వైఎస్సార్‌ సీపీ కార్మిక నాయకుడు వాసంశెట్టి గంగాధరరావు డిమాండ్‌ చేశారు. పవిత్రమైన తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా ఉంటూ అసభ్య కార్యకలాపాల్లో మునిగి తేలడం దారుణమన్నారు. దేవీచౌక్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పాలన సిగ్గు అంటూ ప్లకార్డులు ప్రదర్శించి, నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతమ్‌, మార్గాని సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కొవ్వురు

బీఆర్‌ నాయుడును వెంటనే టీడీపీ చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ కొవ్వూరు కో ఆర్డినేటర్‌ తలారి వెంకట్రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కొవ్వూరు 12వ వార్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడులకు మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నారు. అనంతరం ఆలయం బయట ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. బీఆర్‌ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులు గొందేశి శ్రీనివాసులు రెడ్డి, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

మండపేట

టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడును పదవి నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్‌ చేశారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నారు. అనంతరం కలువుపువ్వు సెంటర్‌ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం, బీఆర్‌ నాయుడుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

నిడదవోలు

తిరుమల ప్రతిష్టను మంటగలిపిన టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని నిడదవోలు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని యర్నగూడెం రోడ్డులో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.

గోపాలపురం

టీటీడీ చైర్మన్‌ పదవికి కళంకం తెచ్చిన బీఆర్‌ నాయుడును తక్షణం పదవి నుంచి తొలగించాలని మాజీ హోం మంత్రి తానేటి వనిత డిమాండ్‌ చేశారు. నల్లజర్లలోని రామకృష్ణ భక్త మందిరంలో మాజీ మంత్రిలో పాటు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల భక్తులు, హిందువుల మనోభావాలను కించపర్చేలా ప్రవర్తించిన బీఆర్‌ నాయుడును పదవి నుంచి తొలగించి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కొవ్వూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న

మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌ తలారి వెంకట్రావు, పార్టీ శ్రేణులు

రాజమహేంద్రవరం దేవీచౌక్‌లో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర

సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతమ్‌, కార్మిక నాయకుడు వాసంశెట్టి గంగాధరరావు, పార్టీ శ్రేణులు

ఫ తిరుమల పవిత్రతను కాపాడండి

ఫ టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడును

పదవి నుంచి తొలగించాలి

ఫ వైఎస్సార్‌ సీపీ శ్రేణుల డిమాండ్‌

ఫ వెంకన్న ఆలయాల్లో పూజలు

ఫ జిల్లా వ్యాప్తంగా నిరసనలు

ఫ పాల్గొన్న మాజీ మంత్రులు,

మాజీ ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement