జాతీయ రెజ్లింగ్‌ పోటీలకు హారిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ రెజ్లింగ్‌ పోటీలకు హారిక

Apr 6 2026 7:42 AM | Updated on Apr 6 2026 7:42 AM

సామర్లకోట: మండల పరిధిలోని వేట్లపాలెం కొండపల్లి గంగన్న మెమోరియల్‌ జిల్లా పరిషత్తు హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న దాసరి హారిక జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు ఎంపిక అయినట్టు పాఠశాల హెచ్‌ఎం అనురాధ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో హారిక ఉత్తమ ప్రతిభ కనబర్చి బహుమతులు సాధించడంతో అండర్‌ 17 రెజ్లింగ్‌ అసోసియేషన్‌ టోర్నమెంట్‌ నేషనల్‌కు ఎంపిక అయినట్టు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 28 నుంచి 30 వరకు మహారాష్ట్రలోని బైరంగాబాద్‌లో జరిగే నేషనల్‌ చాంపియన్‌ షిప్‌లో పాల్గొంటారన్నారు. ఈ మేరకు హారికను ఫిజికల్‌ డైరెక్టర్లు యార్లగడ్డ బంగార్రాజు, ఇబ్రహీం, గ్రామ పెద్దలు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement