అథ్లెటిక్స్‌లో మాస్టర్‌ మాధవి | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌లో మాస్టర్‌ మాధవి

Apr 2 2026 7:47 AM | Updated on Apr 2 2026 7:47 AM

రత్నగిరిపై ఫార్మసీ సూపర్‌వైజర్‌గా

పనిచేస్తూ క్రీడల్లోనూ రాణింపు

రాష్ట్ర స్థాయి షాట్‌పుట్‌, డిస్క్‌ త్రో

పోటీలో కాంస్య పతకాలు

అన్నవరం: దేవస్థానం వైద్యశాలలో ఫార్మసీ సూపర్‌వైజర్‌ వల్లూరి మాధవి క్రీడలలో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. గత నెల 30, 31 తేదీలలో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో శాప్‌ రాష్ట్రస్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో షాట్‌పుట్‌, డిస్క్‌ త్రోలో కాంస్య పతకాలు సాధించారు. బుధవారం స్థానిక విలేకరులకు ఆమె ఈ విషయాన్ని వివరించారు. అన్నవరం దేవస్థానం తరఫున జిల్లా నుంచి 45 ప్లస్‌ విభాగంలో ఆమె ఈ ఘనత సాధించారు.

● జిల్లా స్థాయి నుంచి జాతీయస్థాయి వరకూ ఎన్నో ఆటల పోటీలలో పాల్గొని ఆమె పతకాలు సాధించారు. విశాఖలోని పోర్ట్‌ ట్రస్ట్‌ డైమండ్‌ జూబ్లీ స్టేడియంలో 2020లో జరిగిన మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో మూడు పతకాలు సాధించారు.

● అలాగే 2019లో కర్నూలులో జరిగిన 38వ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో షాట్‌పుట్‌, డిస్క్‌త్రో, జావలిన్‌ త్రోలలో మూడు స్వర్ణాలు కై వసం చేసుకున్నారు.

● 2018లో గుంటూరులో జరిగిన పోటీలో షాట్‌పుట్‌, జావలిన్‌త్రోలో స్వర్ణాలు, డిస్క్‌ త్రోలో రజత పతకం సాధించారు.

● 2015లో కడప జిల్లా పొద్దుటూరులో మూడు స్వర్ణ పతకాలు సాధించారు. అనంతరం ఒంగోలులో జరిగిన ఎన్‌జీఓ ఆటల పోటీలలో నాలుగు పతకాలు సాధించారు.

● విద్యార్థి దశలో సుమారు 30 సార్లు రాష్ట్ర, జాతీయస్థాయి ఆటల పోటీలలో పాల్గొని పతకాలు సాధించినట్టు ఆమె తెలిపారు. ఫార్మసీ విద్యార్థినిగా వాలీబాల్‌ జాతీయ పోటీలలో వరుసగా 1991లో బరంపురంలో, 1992లో భోపాల్‌లో, 1993లో బీహార్‌ లోని పాట్నాలో ఆడానని తెలిపారు.

● 2017 మార్చిలో మైసూర్‌ లో జరిగిన జాతీయస్ధాయి ఎన్‌జీఓ ఆటల పోటీలలో సైతం పాల్గొన్నానని తెలిపారు. ఇంత వరకూ 60కి పైగా పతకాలు సాధించానని వివరించారు. దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ ఎంవీ త్రినాథరావు, దేవస్థానం సిబ్బంది ప్రోత్సాహంతో ఈ విజయాలు సాధించగలుగుతున్నానని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement