ఎవ్వరూ పట్టించుకోవడం లేదు | - | Sakshi
Sakshi News home page

ఎవ్వరూ పట్టించుకోవడం లేదు

Apr 2 2026 7:47 AM | Updated on Apr 2 2026 7:47 AM

నేను చదువుకోలేదు. ఇంటి వద్ద ఉంటూ పనిచేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పారు. రావులపాలెం బ్రాంచ్‌కు వెళ్లాను. అక్కడ రూ.10 వేలు కడితే అగరబత్తీలు ఇస్తామని చెబితే, దఫదఫాలుగా రూ.10.50 లక్షలు చెల్లించాను. తొలుత బాగానే ఇచ్చారు. తర్వాత ఇవ్వడం మానేశారు. నాకు డ్వాక్రాలో వచ్చిన డబ్బులు, ఇంకా దాచుకున్న డబ్బులు కలిసి కట్టాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఎవరూ పట్టించుకోవడంలేదు.

– నాగమణి, బాధితురాలు. మందపల్లి

రూ.1.50 కోట్లు కట్టించాను

రావులపాలెం బ్రాంచ్‌లో నేను రూ.5 లక్షల డిపాజిట్‌ను కట్టాను. నా ద్వారా సుమారు రూ.1.50 కోట్ల వరకూ చాలా మంది చేత కట్టించాను. ప్రారంభంలో బాగానే ఇచ్చేవారు. తర్వాత తక్కువ అగరబత్తీలు ఇచ్చేవారు. ఇదేమిటని అడిగితే స్టాక్‌ లేదని చెప్పేవారు. వారు ఇచ్చిన అగరబత్తీలు ప్యాకింగ్‌ చేసి ఇస్తే సొమ్ములు వేసేవారు. తర్వాత మాయమయ్యారు.

– సత్య, బాధితురాలు రావులపాలెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement