ఇంతలా చెప్పి.. | - | Sakshi
Sakshi News home page

ఇంతలా చెప్పి..

Mar 22 2026 1:57 AM | Updated on Mar 22 2026 1:57 AM

హెల్మెట్‌ తలకెక్కక అనేక ప్రమాదాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. చెప్పి చెప్పి పోలీసులు విగిసిపోతున్నారు. చివరికి తాళ్లపూడిలో వినూత్న ప్రయోగం చేశారు. ఆ గ్రామ బస్టాండ్‌ సెంటర్‌లో శనివారం ఎస్సై టి.రామకృష్ణ వాహన తనిఖీ చేశారు. హెల్మెట్‌ లేనివారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి, అక్కడికక్కడే కొత్త హెల్మెట్‌ కొనిపించి, దానిని ధరింపజేసి పంపించారు. ఇకపై హెల్మెట్‌ పెట్టుకోకుంటే కేసులు తప్పవని హెచ్చరించారు.

–తాళ్లపూడి

పక్కన కాలువే

అడిగేవారు లేకుంటే ఇలానే ఉంటోంది. పక్కనే కాలువ ఉన్నా, నీటిపారుదల శాఖ అభ్యంతరాలు ఉన్నా ఎవరికీ పట్టవు. బొబ్బర్లంక నుంచి మధ్య డెల్టా కాలువ వెంబడి రావులపాలెం ప్రధాన రహదారి ఉంటోంది. ఇటుగా వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారు. ఇటుగా కాలువ వెంబడి ఆక్రమణలు జోరందుకున్నాయి. ఇటీవల పులిదిండి వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుకు చేర్చి, కాలువ పక్కనే వాణిజ్య షెడ్డు వేసినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. – ఆత్రేయపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement