సముద్రంలో యువకుడి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

సముద్రంలో యువకుడి మృతదేహం లభ్యం

Mar 22 2026 1:57 AM | Updated on Mar 22 2026 1:57 AM

అల్లవరం: ఓడలరేవు తీరంలోని గ్రోయిన్ల నిర్మాణాల వద్ద భారీ కెరటాలకు అమలాపురానికి చెందిన దొమ్మేటి లోకేష్‌ (17) శుక్రవారం గల్లంతైన విషయం తెలిసిందే. మైరెన్‌ పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆధ్వర్యంలో గజ ఈతగాళ్ల సాయంతో అతని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం ఓడలరేవు సముద్ర తీరంలో లోకేష్‌ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో అక్కడ లోకేష్‌ తండ్రి విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై అల్లవరం ఎస్సై సంపత్‌కుమార్‌ కేసు నమోదు చేశారు. మైరెన్‌ సీఐ ఎంవీవీఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ ఓడలరేవు బీచ్‌ ప్రమాదకంగా ఉందని, యువతీ యువకులు సేఫ్టీ విధానాలు పాటించకుండా సముద్రంలో స్నానాలు చేయకూడదని సూచించారు. గ్రోయిన్ల నిర్మాణాల్లో ఉపయోగిస్తున్న టెట్రాపాడ్‌పై నాచు ఉందని, వీటిపై నడిస్తే సముద్రంలోకి జారిపడే అవకాశం ఉందన్నారు. బీచ్‌కు వెళ్లే వారంతా జాగ్రత్తలు పాటించాలన్నారు. రాత్రి వేళల్లో తీరంలో సంచరించ వద్దని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement