కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక కాతేరు సెంటర్‌లోని కోయంబత్తూర్ కాఫీ దుకాణం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమల స్కూల్లో ఇంగ్లిషు టీచర్‌గా పనిచేస్తున్న బొంగు గాయత్రి (40) మృతి చెందారు. వివరాల్లోకెళితే.. రఘుదేవపురానికి చెందిన గాయత్రి పదేళ్లుగా తిరుమల స్కూల్లో ఇంగ్లిషు టీచర్‌గా పనిచేస్తూ, స్థానికంగా మల్లయ్యపేటలో నివాసముంటున్నారు. శుక్రవారం, గాయత్రిని స్కూల్లో దింపేందుకు ఆమె భర్త బొంగు రాజా రావు మోటారు సైకిల్‌పై తీసుకువెళుతున్నాడు. ఆ క్రమంలో తిరుమల కళాశాల బస్సు కాతేరు సెంటర్ వద్ద ఆగి విద్యార్థులను ఎక్కించుకుని బయలుదేరింది. అదే సమయంలో వెనుక నుంచి మరో లారీ వస్తోంది. ఈ క్రమంలో ఆగివున్న తిరుమల బస్సును ఓవర్‌టేక్ చేయబోయారు. ఈ క్రమంలో ఆ టీచర్ ఆ స్కూలు బస్సు కిందే పడి మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ రాజారావు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. అతడికి నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తొలి తిరుపతిలో
29 నుంచి కల్యాణోత్సవాలు
పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసిన శృంగార వల్లభ స్వామి వారి కల్యాణోత్సవాలు ఈ నెల 29 నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకూ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం పందిరి రాట ముహూర్తం చేశారు. ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు, చైర్మన్ మెయిలి సంధ్యా కృష్ణమూర్తి ఆధ్వర్యాన అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. ఈ నెల 29వ తేదీ ఉదయం స్వామి వారి విశేషార్చన, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠా పన, ధ్వజారోహణ, సాయంత్రం శ్రీదేవి, భూ దేవి సమేత శృంగార వల్లభస్వామి కల్యాణం జరుగుతాయని ఈఓ వివరించారు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకూ ప్రతి రోజూ ఉదయం నిత్య హోమం, బలిహరణ, తీర్థ ప్రసా ద వితరణ ఉంటాయన్నారు. 30వ తేదీ సాయంత్రం గ్రామోత్సవం, 31వ తేదీ సాయంత్రం సదస్యం, ఏప్రిల్ ఒకటో తేదీ సాయంత్రం చోర సంవాదం, రెండో తేదీన పూర్ణాహుతి, ధ్వజావరోహ ణ చక్రస్నానం, బుక్క పండగ, గ్రామోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 3న పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయని ఈఓ చెప్పారు.
3, 4 తేదీల్లో నృసింహ
నక్షత్ర మాల ధారణ
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 3, 4 తేదీల్లో నృసింహ నక్షత్ర మాల దీక్షాధారణ చేపడుతున్నట్లు ఆలయ ఈవో ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ శుక్రవారంఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు తరలివచ్చి నక్షత్ర మాల ధారణ చేయాలని కోరారు. అలాగే, దీక్ష విరమణ ఏప్రిల్ 30వ తేదీన నృసింహ జయంతి రోజున నిర్వహిస్తామని పేర్కొన్నారు.


