మీ విశ్వసనీయత స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

మీ విశ్వసనీయత స్ఫూర్తిదాయకం

Mar 21 2026 5:19 AM | Updated on Mar 21 2026 5:19 AM

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌

సూర్యనారాయణరెడ్డి

వైఎస్సార్‌ సీపీప్రజాప్రతినిధులకు సన్మానం

అనపర్తి: ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీకి విధేయులుగా ఉంటూ, ప్రజల పక్షాల పోరాడుతూ మీరు చూపిన విశ్వసనీయత అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రజాప్రతినిధులను వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి అభినందించారు. పొలమూరు శ్రీదేవి ఫంక్షన్‌ హాల్లో ఆ గ్రామ ఉప సర్పంచ్‌ సత్తి సూరారెడ్డి, వెంకటరెడ్డి బ్రదర్స్‌ ఆధ్వర్యంలో జిల్లా ప్రజాపరిషత్‌ మాజీ ప్రతిపక్షనేత సత్తి రామారెడ్డి అధ్యక్షతన శుక్రవారం ప్రజాప్రతినిధుల సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మండలంలోని సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు తదితర ప్రజాప్రతినిధులను దుశ్శాలువాలు, పూలమాలలతో సత్కరించి, వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులుగా విజయం సాధించిన సర్పంచ్‌లు, పంచాయతీ పాలకమండలి సభ్యుల పదవీ కాలం ఏప్రిల్‌ 2తో పూర్తి కావస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఐదేళ్లుగా వారు పార్టీ, ప్రజలకు చూపిన విధేయత, విశ్వసనీయతకు, అంకిత భావానికి గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపిన సత్తి సూరారెడ్డి బ్రదర్స్‌ను అభినందించారు. అలాగే విశ్వసనీయతే విలువైన ఆస్తిగా భావించి, ఎన్ని ఒత్తిడిలు ఎదురైనా పార్డీకి విధేయులుగా ఉన్న ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల్లో ఎన్నో ఒత్తిడులు, ప్రలోభాలు, బెదిరింపులు ఎదురైనా, పార్టీని విడవకుండా నిలిచిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, పార్టీ అనపర్తి మండల కన్వీనర్‌ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు), అనపర్తి టౌన్‌ కన్వీనర్‌ నల్లమిల్లి మురళీ మోహన బాలకృష్ణారెడ్డి (మురళీ) తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement