ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ వ్యవస్థ అసలు బాగాలేదు. దీనిపై మూడు రోజుల క్రితం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. నిత్యం ఆస్పత్రిలో దొంగతనాలు జరుగుతున్నాయి. సెక్యూరిటీ సూపర్‌వైజర్ సైతం సరిగ్గా విధుల్లో ఉండడం లేదు. సెక్యూరిటీ సిబ్బంది వారిని వారే రక్షించుకోలేకపోతే ఇంత పెద్ద ఆసుపత్రిని ఎలా కాపాడతారు. సెక్యూరిటీ గార్డుపై, ఆసుపత్రిలో రోగి తాలూకా బంధువులు, ఇతరుల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.
– డాక్టర్ జి.రాజశేఖర కెనడీ, సూపరింటెండెంట్, ప్రభుత్వాసుపత్రి, రాజమహేంద్రవరం


