బార్కాస్‌ అరేబియన్‌ రెస్టారెంట్‌పై ఐటీ దాడులు | - | Sakshi
Sakshi News home page

బార్కాస్‌ అరేబియన్‌ రెస్టారెంట్‌పై ఐటీ దాడులు

Mar 9 2026 7:27 AM | Updated on Mar 9 2026 7:27 AM

రాజమహేంద్రవరం సిటీ: హోటల్‌ వ్యాపార లావాదేవీల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ రికార్డుల్లో నమోదు చేయడం లేదనే ఆరోపణల నేపథ్యంలో స్థానిక ప్రకాశం నగర్‌లోని బార్కాస్‌ అరేబియన్‌ కిచెన్‌ రెస్టారెంట్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆదివారం ఆకస్మికంగా దాడులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ రెస్టారెంట్లపై చేపట్టిన ఆకస్మిక దాడుల్లో భాగంగా ఈ తనిఖీలు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు రూ.70 వేల కోట్ల డిజిటల్‌ పేమెంట్లను ఆదాయంగా చూపకపోవడంతో ఈ దాడులు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ రెస్టారెంట్‌లో జరిగిన వ్యాపారానికి పన్ను ఎగ్గొట్టినట్లు సమాచారం రావడంతో డిజిటల్‌ రికార్డులను అధికారులు సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, నెల్లూరు తదితర ప్రాంతాల్లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.

నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో నేడు యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)తో పాటు, రెవిన్యూ కినిక్‌ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ కీర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేశారు. అర్జీదారులు అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాల కోసం 1100కు నేరుగా కాల్‌ చేయవచ్చని కలెక్టర్‌ సూచించారు. వాట్సప్‌ నెంబర్‌ 95523 00009 ద్వారా పౌర సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.ఆయా ప్రాంతాల్లో ఆర్డీవోలు, తహసీల్దార్లు తమ ప్రధాన కార్యాలయాల నుంచి హాజరై ప్రజల అర్జీలను స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement