● హిమ ఝరి సొగసులు!
వీక్షించే మనుసుండాలిగానీ ప్రకృతి
ఆవిష్కరించే సోయగాలు కోకొల్లలు! ఎల్లలెరుగని ఆ అందాలు రాజమందరంలో శుక్రవారం ఉదయించాయి. అఖండ గోదావరిపై పరచుకున్న మంచుతెరలు ఆహ్లాదాన్ని పంచాయి. గోదారి మాతకు వడ్డాణాలుగా భాసిల్లుతున్న వంతెనలను కొంతసేపు మాయం చేశాయి. అలుపెరుగని అలల పయనాన్ని అడ్డుకోజూశాయి! పరిసరాలన్నీ మూసుకుపోయి ప్రకృతి ప్రేమికుల కళ్లు మరింత విచ్చుకొనేలా చేశాయి.!
– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం
‘తెర’వారుజాము :
సెంటర్ జైలు రోడ్డులో ఇలా..


