కోత ఖర్చులూ రావడం లేదు | - | Sakshi
Sakshi News home page

కోత ఖర్చులూ రావడం లేదు

Jan 2 2026 11:12 AM | Updated on Jan 2 2026 11:12 AM

కోత ఖ

కోత ఖర్చులూ రావడం లేదు

మంచి ధర లభిస్తోందని రెండెకరాల్లో కొత్తిమీర సాగు చేపట్టాను. పంట చేతికి వచ్చిన సమయంలో కిలో ధర రూ.80 ఉండేది. నేడు రూ.15 దక్కుతోంది. కోత ఖర్చులు కూడా రావడం లేదు.

– గుడాల వెంకటేశ్వరరావు,

కొత్తిమీర, రైతు, కాకరపర్రు

నష్టం మిగిలింది

రెండెకరాలు కౌలుకు తీసుకుని కొత్తిమీర పంట వేశాను. పెట్టుబడి రూ.40 వేలైంది. పంట బాగా పండింది. మార్కెట్లో ధర లేకపోవడంతో అసలు పెట్టుబడి పోయింది. నష్టమే మిగిలింది.

– పి.ఆదినారాయణ, కొత్తిమీర రైతు, ముక్కామల

ముందొచ్చిన లాభం

ఈ పంటలో పోయింది

ఐదెకరాల్లో కొత్తిమీర సాగు చేశాను. ఎకరానికి రూ.20 వేల పెట్టుబడి అయ్యింది. మూడెకరాల్లో పంట ముందుగానే రావడంతో కిలో రూ.80 చొప్పున ఆదాయం వచ్చింది. ఇప్పుడు మరో 2 ఎకరాలు సాగు చేశాను. మార్కెట్లో ధరలు లేకపోవటంతో పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. ముందు పంట లాభాలను ఈ పంట తినేసింది.

– ఆకుల సూర్యనారాయణ,

రైతు, ముత్యాలవారిపాలెం

కోత ఖర్చులూ రావడం లేదు
1
1/2

కోత ఖర్చులూ రావడం లేదు

కోత ఖర్చులూ రావడం లేదు
2
2/2

కోత ఖర్చులూ రావడం లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement