బదిలీలలు! | - | Sakshi
Sakshi News home page

బదిలీలలు!

Nov 10 2025 8:10 AM | Updated on Nov 10 2025 8:10 AM

బదిలీలలు!

బదిలీలలు!

సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

సాక్షి, రాజమహేంద్రవరం: ఎకై ్సజ్‌ శాఖలో బది‘లీలలు’ వెలుగు చూస్తున్నాయి. ఐదు నెలల వ్యవధిలోనే ఒక ఉద్యోగిని మూడుసార్లు బదిలీ చేసి రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకూ ఏ శాఖలోనూ ఇలాంటి బదిలీలు జరగలేదని ఉద్యోగులు విస్మయానికి గురవుతున్నారు. సిబ్బంది అభీష్టం మేరకు ఈ బదిలీలు చేశారనుకుంటే పొరపాటే. తమకు ఇష్టమొచ్చిన విధంగా పోస్టింగులు ఇచ్చేశారని, కావాల్సిన వారికి అనుకూలమైన స్థానాలు కేటాయించారని, దీని వెనుక మతలబు దాగుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ కేంద్రంగా ఈ తతంగం మొత్తం జరిగినట్లు విమర్శలున్నాయి.

ఏం జరిగిందంటే..

ఫ ఎకై ్సజ్‌ శాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్న ఉద్యోగుల ఆటాచ్‌మెంట్‌ను రద్దు చేస్తూ గత జూలై నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయా ఉద్యోగులు ఎవరి స్థానాలకు వారు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంతలోనే ఏమైందో కానీ.. అదే నెల 23న కొంత మందిని వేరే స్థానాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ఫ రెండుసార్లు బదిలీ అయిన ఉద్యోగులకు పని చేయాల్సిన స్థానం చూపించడంతో ఇప్పటికై నా కొద్ది రోజుల పాటు ఉద్యోగం చేసుకోవచ్చునని భావించారు. అంతలోనే తిరిగి అక్టోబర్‌ 8న కొందరిని మళ్లీ బదిలీ చేశారు.

ఫ అది చాలదన్నట్లు నెల రోజులు గడవక ముందే మళ్లీ బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా అక్టోబర్‌ 8న బదిలీ చేసిన కొందరు ఉద్యోగులకు మళ్లీ ఈ నెల 7న స్థానచలనం కలిగించారు.

ఫ మరీ విచిత్రంగా గత శుక్రవారం ఉదయం ఒక బదిలీ ఉత్తర్వు ఇచ్చారు. సాయంత్రానికల్లా ఆ జాబితా మారుస్తూ మరో ఉత్తర్వు వెలువరించారు.

ఫ ఒక్క రోజులోనే రెండుసార్లు బదిలీ ఉత్తర్వులు ఇవ్వాల్సినంత అవసరం ఏముందనే ప్రశ్న తలెత్తుతోంది.

ఫ ఎకై ్సజ్‌ శాఖలో జరుగుతున్న ఈ బది‘లీలలు’ చూసి ఇతర శాఖల్లోని ఉద్యోగులు నివ్వెరపోతున్నారు.

ఫ ఏడాది వ్యవధిలోనే ఒక ఉద్యోగి నాలుగుసార్లు బదిలీ అయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఫ ఒక ఉద్యోగికి స్థానచలనం కలిగితే.. వారి కుటుంబం మొత్తం అక్కడి నుంచి బదిలీ అయిన ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. పిల్లల చదువుల దృష్ట్యా పాఠశాల మార్చాలి. వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధ పడేవారికి వైద్యం చేయించడంలోనూ ఇబ్బందులు తప్పవు.

ఫ ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం కావాల్సిన వారికి కోరుకున్న స్థానాలు కట్టబెట్టేందుకే ఇతర ఉద్యోగులను బలి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

నవోదయం 2.0 పూర్తయినట్లు కలరింగ్‌!

సారా నియంత్రణ, బెల్టు షాపులను కట్టడి చేసేందుకు నవోదయం 2.0 పేరుతో ఎకై ్సజ్‌ శాఖ ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తోంది. దీనిలో భాగంగా సారా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలి. ఆయా గ్రామాలను సారా రహితంగా మార్చాలి. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జిల్లాలోని రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలతో పాటు కొన్ని గ్రామాల్లో సారా తయారీ, విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా బెల్టు షాపుల్లో మద్యం విక్రయిస్తున్నారు. అయినప్పటికీ ఎకై ్సజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఏదో ఒక సారా కేంద్రంపై దాడి చేయడం.. పూర్తిగా అరికట్టామంటూ ప్రకటించడం పరిపాటిగా మారింది. నవోదయం 2.0 పూర్తవకపోయినా.. పూర్తయిందని, సారాను నియంత్రించేశామని నమ్మబలుకుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు సైతం చెప్పినట్లు సమాచారం. నవోదయం 2.0 పూర్తయిన కారణంగా సిబ్బంది బదిలీలు చేపడుతున్నట్లు కలరింగ్‌ ఇచ్చారు. అయితే, తాజాగా సైతం మూడు సారా కేసులు పట్టుకుని వదిలేసినట్లు తెలిసింది.

ఫ ప్రతిసారీ స్టేషన్‌ సిబ్బందిని బదిలీ చేస్తున్నారే తప్ప.. ఈఎస్‌టీఎస్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బందికి మాత్రం స్థానచలనం కలగడం లేదన్న విమర్శలున్నాయి. పైగా తమకు అనుకూలమైన వారిని ప్రత్యేకంగా జీఓలు ఇచ్చి మరీ ఈ రెండు విభాగాల్లోకీ బదిలీ చేసుకుంటున్నట్లు సమాచారం.

ఫ ఎకై ్సజ్‌ శాఖలో ఓ సీఐ చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ఎస్‌ఈబీలో మొదలైన ఈ సీఐ ప్రస్థానం ఇప్పటికీ అక్కడే కొనసాగుతున్నట్లు తెలిసింది. సదరు సీఐ రాజమహేంద్రవరంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు.

ఫ ఐదు నెలల వ్యవధిలో మూడుసార్లు స్థానచలనం

ఫ నవోదయం 2.0 పేరుతో అడ్డగోలు వ్యవహారం

ఫ నిర్ఘాంతపోతున్న ఎకై ్సజ్‌ ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement